skip to Main Content

Election Publicity

Electionpublicity.com has become a hub for diverse talents, including politicians, artists, and media personalities, actively engaging in elections. The organization aims to address disparities, contribute to India’s constructive development, and foster a strong democratic nation. With a focus on scientific surveys and voter awareness, it encourages dispassionate youth participation in elections for a more vibrant India

About Us

గత ఐదు దశాబ్దాలుగా వివిధ స్థాయిల్లో ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తూ, ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా విజయవంతంగా పనిచేసిన ప్రజాస్వామిక శక్తులు, సృజనశీలురు, మేధావులు, ఆర్టిస్టులు, మీడియా పర్సన్స్‌ మేలుకలయికగా ఆవిర్భవించినదే electionpublicity.com. తమ నైపుణ్యాలను ఒకేవేదిక మీదకు తీసుకొచ్చి, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు శాస్త్రీయమైన ఎన్నికల సర్వేలు, మల్టీమీడియా పబ్లిసిటీ క్యాంపెయిన్లు, ఓటరు అవగాహన, చైతన్య కార్యక్రమాలను సింగిల్‌ విండో ప్రాతిపదికన అందించాలన్న ఉదాత్త లక్ష్యంతో మా సంస్థ ఈ రంగంలో పనిచేస్తూ వస్తోంది. ఉన్నత లక్ష్యాలు, ఆశయాలతో కూడిన నవ,యువతరం ఎన్నికల్లో పోటీ చేయటానికి నిరాసక్తంగా ఉంటోంది. పోటీ మాట అటుంచి పోలింగ్‌ నాడు ఓటు హక్కు వినియోగించుకోవడం తమ పవిత్ర కర్తవ్యం, హక్కు అనే స్పృహను కూడా కలిగి లేరు. మరో పక్క చట్టసభలలో వివిధ వర్గాలకు తగినంత సముచిత ప్రాతినిధ్యం దక్కడం లేదు. ఈ లోటుపాట్లను, అసమానతలను తొలగించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ను నిర్మాణాత్మకంగా మరింత బలోపేతం చేయాలన్న సదాశయంతో, విశాల దృక్పథంతో ఎన్నికల రంగంలో పాటుపడుతూ వస్తున్నాం.

Why Choose Us

electionpublicity.com నే ఎందుకు ఎంచుకోవాలి?

ఈ రోజుల్లో ప్రచారానికి ఉన్న విలువ ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఏ తరహా ప్రచారంతో అభ్యర్థి ఇమేజిని ఎలా పెంపొందించుకోవాలి, స్థానికంగా ఉన్న ఏయే సమస్యలను హైలైట్‌ చేసి ప్రజల మద్దతు పొందాలి, ప్రత్యర్థి బలాబలాలను అంచనావేస్తూ కౌంటర్‌ స్ట్రేటజీలు ఎప్పటికప్పుడు ఎలా రూపొందించుకోవాలి, ఓటరు చైతన్య కార్యక్రమాలతో ఓటింగ్‌ శాతాన్ని పెంచి, తటస్థ ఓటరును మనవైపు ఎలా తిప్పుకోవాలి వంటి ప్రతి అంశంపైనా క్షేత్రస్థాయి వాస్తవాలతో, ఓటరు పల్స్‌ను క్షణక్షణమూ అధ్యయనం చేసి పరిస్థితులకు తగ్గట్టుగా మల్టీమీడియా పబ్లిసిటీ క్యాంపెయిన్స్ ను మేం మీకోసం చేపడతాం. ఎన్నికల బరిలో దిగి పోటీ చేస్తున్న మీరు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకొనే వ్యవధిగానీ, మనసులగ్నం చేసే అవకాశం గానీ ఉండదు. కనుక మీ తరఫున మా నిపుణుల బృందం తగిన అంచనాలు, ఆలోచనలు, ప్రణాళికలతో కార్యాచరణను రూపొందించి మీ సమ్మతితో అమలు చేస్తుంది. అవుట్‌డోర్‌ పబ్లిసిటీ, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాతోపాటు సోషల్‌ మీడియా కూడా ఎక్కువ ప్రభావశీల పాత్ర పోషిస్తోంది. సోషల్‌ మీడియాలో వచ్చిన ఒక నెగెటివ్‌ పోస్టుతో విజయావకాశాలు చేజారిపోవచ్చు. లేదా ఒక పాజిటివ్‌ పోస్టుతో గెలుపు తీరమూ చేరవచ్చు. అలాగే పంటచేలో కురిసిన వాన పసిడి ధాన్యరాశులను పండిస్తుంది. ఏ రోడ్డు మీదో పడిన వానతో రవ్వంత మేలు జరగకపోగా వాహనాలు స్కిడ్‌ అయి ప్రమాదాలు చోటుచేసుకోవచ్చు. అందుకే ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నాం? ప్రతి రూపాయి నుంచి మాగ్జిమమ్‌ రిజల్ట్‌ పొందగలుగుతున్నామా? అనేది అత్యంత కీలకం.

మా నిపుణుల బృందం ఎక్కడో పైరాష్ట్రాల నుంచి ఊడిపడినది కాదు. హైదరాబాద్‌ సిటీకే చెందిన ఈ బృంద సభ్యులందరికీ స్థానిక పరిస్థితులేమిటో, వారి వేషభాషలు, అభిరుచులు, గోసలు ఏమిటో, వారేమి కోరుకొంటున్నారో వారి మనసు గెలుచుకోవటానికి ఏం చేయాలో క్షుణ్ణంగా తెలుసు. దీనికితోడుగా గ్రామపంచాయతీ నుంచి లోక్‌సభ స్థాయి వరకు వివిధ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం మల్టీమీడియా పబ్లిసిటీ క్యాంపెయిన్లు, ఎన్నికల సర్వేలు నిర్వహించిన అపార అనుభవం ఉంది. 2019 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో నిర్వహించిన శాస్త్రీయమైన ఎన్నికల సర్వేలో ముందుగానే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచే అభ్యర్థులను స్పష్టంగా పేర్కొనగలిగాం. మా సర్వే ఫలితాలు నూరుశాతం నిజమని తుది రిజల్ట్‌ నిరూపించింది. క్షేత్రస్థాయిలో పదివేల శాంపిల్‌తో జరిపిన సర్వే ఎంత పకడ్బందీగా, శాస్త్రీయంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన క్షణం నుంచి, గెలుపు ధ్రువీకరణ పత్రం పొందేవరకూ ప్రతి ఘట్టంలో మీకు మేం తోడునీడగా నిలిచి, సింగిల్‌ విండో ప్రాతిపదికన మల్టీమీడియా పబ్లిసిటీ క్యాంపెయిన్ ను నిర్వహించిపెడతాం. ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవలసిన అవసరాన్ని చాటిచెబుతూ ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఓటింగ్‌శాతం మీకు అనుకూలంగా పెంచేలా కృషి చేస్తాం. మీటింగ్‌లకు ఏర్పాట్లు, ప్రజల సమీకరణ, ఏ కాలనీ, ఏ బస్తీలో ఏయే సమస్యలు, అంశాలు లేవనెత్తడం ద్వారా అక్కడి వారి మనసు దోచుకొనేలా మీ ప్రసంగం ఉండేందుకు అందులో పొందుపరచాల్సిన పాయింట్లు తయారుచేసి ఇస్తాం. ఎన్నికల సర్వేల నిర్వహణ ద్వారా ఓటరు పల్స్‌ మీకు తెలియచెప్పి, చివరి నిమిషంలో పోల్‌స్ట్రేటజీలు ఎలా మార్చుకోవాలో సలహాలు, సూచనలు అందిస్తాం. మీ పార్టీ మేనిఫెస్టోకు తోడుగా స్థానిక ప్రజల ఆకాంక్షలకు తగినవిధంగా మీకోసం ప్రత్యేకంగా అనుబంధ అభ్యర్థి మేనిఫెస్టో రూపొందించి ఇస్తాం. మల్టీకలర్‌లో వాల్‌పోస్టర్లు, పాంప్లెట్ల తయారీ, ప్రింటింగ్‌, మీ ఫొటో, సింబల్‌తో క్యాప్‌లు, బ్యాడ్జీలు బ్యానర్ల వంటి పబ్లిసిటీ మెటీరియల్‌ను ఆర్డర్‌పై తయారు చేయించి అందజేస్తాం. యూట్యూబ్‌ , ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా మల్టీమీడియా పబ్లిసిటీని దిగ్విజయంగా చేసి పెడతాం. అలా మీకు కావలసిన సమస్త సర్వీసులను సింగిల్‌విండో ప్రాతిపదికన రూపొందించగలుగుతాం.

మా సంకల్పం

Informed citizen ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని గాఢంగా నమ్ముతున్నాం. ఈ దృష్ట్యానే క్లిష్టంగా ఉన్న ఎన్నికల ప్రక్రియను, వ్యూహాలను నియమ నిబంధనలను సరళం చేసి, ఎన్నికల్లో ఎవరైనా పోటీచేయవచ్చన్న భరోసాను, నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కల్పించడంకోసం electionpublicity.com పాటుపడుతుంది. సరైన, నిష్పాక్షిక సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా ఓటర్లు విజ్ఞతాయుత నిర్ణయం తీసుకొనేలా దోహదపడటం, ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించడం మా ఆశయం. ప్రజలు తమ అభీష్టం మేరకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొనేలా చూసి, ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం పరమ పవిత్రమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాం.

మా లక్ష్యం

ఆరోగ్యప్రదమైన చర్చలు, ఆలోచనలు స్వేచ్ఛగా సాగే వాతావరణాన్ని, వేదికలను కల్పించి, విభిన్న భావజాలాలు, సిద్ధాంతాలను సామాన్య ఓటరు కూడా అర్థం చేసుకొనేలా విడమరచి చెప్పేందుకు రౌండ్‌టేబుల్‌ సమావేశాల ద్వారా పాటుపడతాం. ప్రజల ఆకాంక్షలు, ఆశలు, సమస్యలను ప్రముఖంగా వెలికి వచ్చేలా చూసి, ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేవారు ఆ దిశగా పరిష్కారాలు కనుగొనేలా చోదకశక్తిగా నిలవడం, హింసకు తావులేని, శాంతియుత స్వేచ్ఛా ఎన్నికలు జరిగేలా తోడ్పడి, ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠపరచడం మా లక్ష్యం.

Feel free to contact us.
We are here to help!

Address:

5-34

Durga Nagar Colony

Dilsukhnagar, Hyderabad

Telangana,500060

Ph:8977041878

Please fill out the form and we’ll get back to you asap.

    Back To Top